ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 24, 2020 , 00:13:16

దాదాకు మినహాయింపునివ్వండి

 దాదాకు మినహాయింపునివ్వండి

  • కూలింగ్‌ పీరియడ్‌ అంశంపై ఆదిత్య వర్మ

న్యూఢిల్లీ: జస్టిస్‌ ఆర్‌ఎమ్‌ లోధా కమిటీ సిఫార్సు చేసిన కూలింగ్‌ పీరియడ్‌ నుంచి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి మినహాయింపు ఇవ్వాలని.. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ విషయంలో తొలి పిటీషన్‌ దాఖలు చేసిన ఆదిత్య వర్మ సుంప్రీకోర్టును కోరనున్నారు. దాదా లాంటి దమ్మున్న నాయకుడు పూర్తికాలం సేవలందించకపోవడం సరైంది కాదని భావించే పిల్‌ వేయనున్నట్లు ఆదిత్య వర్మ పేర్కొన్నారు. ‘బీసీసీఐ నిబంధనలు మార్చాలని కోరిన నేనే.. సౌరవ్‌ గంగూలీ విషయంలో మినహాయింపు నివ్వాలని అడుగుతున్నా. దాదా ప్యానల్‌ మూడేండ్ల పాటు పదవిలో ఉంటే.. క్రికెట్‌కు మేలు జరుగుతుందని భావించే ఈ నిర్ణయానికి వచ్చా’ అని ఆయన అన్నారు. 


logo