బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 02, 2020 , 15:45:28

ఈ ఏడాది నుంచే ఉమెన్స్‌ ఐపీఎల్‌?

ఈ ఏడాది నుంచే ఉమెన్స్‌ ఐపీఎల్‌?

న్యూ ఢిల్లీ: మహిళా క్రికెట్‌కు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ఏడాది నుంచే ఉమెన్స్‌ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ది బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) యోచిస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు బోర్డు మెంబర్‌ ఒకరు పేర్కొన్నారు. ‘ఉమెన్స్‌ ఐపీఎల్‌ లేదా ఉమెన్స్‌ టీ 20 ఛాలెంజ్ నిర్వహించాలనుకుంటున్నాం. ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నాం.’ అని వెల్లడించారు. 

అలాగే, మహిళా క్రీడాకారులకోసం శిక్షణా శిబిరం కూడా ఉంటుందని, ఆ దిశగానే పనులు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని పక్కాగా అమలుచేసేందుకు త్వరలో సరైన ప్రణాళిక కూడా రూపొందిస్తామన్నారు. ఉమెన్స్‌ టోర్నమెంట్‌ నవంబర్‌ 1-10వ తేదీ మధ్య నిర్వహించాలనుకుంటున్నాం.. ఇంకా ఇది చర్చల దశలోనే ఉందన్నారు. ఇంకా ఏదీ ఖరారు కాలేదని, తాము కూర్చుని ప్రతి అంశంపై చర్చిస్తామని స్పష్టం చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo