బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 27, 2020 , 15:30:46

కోబ్ బ్ర‌యంట్ మృతి.. బీసీసీఐ, స‌చిన్ నివాళి

కోబ్ బ్ర‌యంట్ మృతి..  బీసీసీఐ, స‌చిన్ నివాళి

హైద‌రాబాద్‌:  అమెరికా బాస్కెట్‌బాల్ చ‌రిత్ర‌లో దిగ్గ‌జ ప్లేయ‌ర్‌గా గుర్తింపు పొందిన కోబ్ బ్ర‌యంట్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.  ఆ ప్ర‌మాదంలో 41 ఏళ్ల‌ బ్ర‌యంట్‌తో పాటు 9 ఏళ్ల కుమార్తె కూడా మృతిచెందింది.  బ్ర‌యంట్ మృతి ప‌ట్ల నివాళులు వెల్లువెత్తుతున్నాయి. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇవాళ సంతాపం ప్ర‌క‌టించింది. బ్రయంట్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆశిస్తూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది.  హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మొత్తం 9 మంది మృతిచెందారు.  మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా నివాళి అర్పించారు.  కోబ్ బ్ర‌యంట్ మృతి విషాదాన్ని మిగిల్చింద‌న్నారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, అభిమానుల‌కు సంతాపం తెలుపుతున్న‌ట్లు స‌చిన్ పేర్కొన్నారు.  డాషింగ్ బ్యాట్స్‌మెన్, మాజీ క్రికెట‌ర్ సెహ్వాగ్ కూడా కోబ్ మృతి ప‌ట్ల నివాళి తెలిపారు. కోబ్ వ‌ల్లే చాలా మంది ఎన్‌బీఏ ఫ్యాన్స్ అయ్యార‌ని సెహ్వాగ్ అన్నారు.


ఎవ‌రీ బ్ర‌యంట్‌..

అమెరికాలో బాస్కెట్‌బాల్‌కు మ‌క్కువ ఎక్కువ‌.  లాస్ ఏంజిల్స్ లేక‌ర్స్ జ‌ట్టు త‌ర‌పున బ్ర‌యంట్ త‌న కెరీర్ మొత్తం ఆడాడు. సుమారు 20 ఏళ్ల ఆ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2016 ఏప్రిల్‌లో రిటైర్ అయ్యాడు. 2008లో ఎన్‌బీఏ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయ‌ర్ అవార్డు గెలుచుకున్నాడు.  రెండుసార్లు ఎన్‌బీఏలో స్కోరింగ్ చాంపియ‌న్‌గా నిలిచాడు.  రెండు సార్లు ఒలింపిక్ చాంపియ‌న్‌గా కూడా రికార్డు సృష్టించాడు.  2006లో అత‌ను అత్య‌ధికంగా టొరంటో రాప్‌ట‌ర్స్‌పై 81 పాయింట్లు స్కోర్ చేశాడు.  డియ‌ర్ బాస్కెట్‌బాల్ షార్ట్ ఫిల్మ్ తీశాడు. అయిదు నిమిషాల ఆ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు ద‌క్కింది.  2003లో లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. రేప్ చేశాడంటూ ఓ 19 ఏళ్ల అమ్మాయి ఆరోప‌ణ‌లు చేసింది. ఆ ఆరోప‌ణ‌లను కొట్టిపారేసిన బ్ర‌యంట్‌.. త‌మ మ‌ధ్య ఇష్ట‌పూర్వ‌క‌మైన శృంగారం చోటుచేసుకున్న‌ట్లు చెప్పారు.   


logo