సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 17:31:17

ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు అభిమానుల‌కు అనుమ‌తి!

ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు అభిమానుల‌కు అనుమ‌తి!

ముంబై: ఇండియ‌న్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పనుంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ). చాలా రోజులుగా క్రికెట్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని ఉవ్విళ్లూరుతున్న అభిమానుల ఆశ‌లు త్వ‌ర‌లోనే నెర‌వేరే అవ‌కాశాలు ఉన్నాయి. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు క‌నీసం 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను స్టేడియాల‌కు అనుమ‌తించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ జ‌రిగే అన్ని స్టేడియాల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాల‌ని అనుకుంటోంది. కొవిడ్ కార‌ణంగా ఈ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే ప‌రిమితం చేశారు. 

చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణెల‌లో మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే వీటిలో కొన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్లు మాత్రం 20 నుంచి 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించే అవ‌కాశం ఉంది. చివ‌రిసారి గ‌తేడాది జ‌న‌వ‌రిలో ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ప్రేక్ష‌కులు ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూశారు. ఆ త‌ర్వాత అస‌లు ఇండియాలో మ్యాచ్‌లే జ‌ర‌గ‌లేదు. ఐపీఎల్ కూడా యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా సాగింది. డొమెస్టిక్ టోర్నీలైన రంజీ ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలు కూడా ప్రేక్ష‌కులు లేకుండానే సాగుతున్నాయి. 

VIDEOS

logo