సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 13:16:47

బీసీసీఐ మెడికల్‌ కమిషన్‌ సభ్యుడి కరోనా పాజిటివ్‌!

బీసీసీఐ మెడికల్‌ కమిషన్‌ సభ్యుడి కరోనా పాజిటివ్‌!

చెన్నై : భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) మెడికల్‌ కమిషన్‌ సభ్యుడు కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు సమాచారం. ఆయనకు లక్షణాలు లేవని, ప్రస్తుతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. గతవారం 13 మంది చెన్నై సూపర్‌ కింగ్‌ ఆటగాళ్లు పాజటివ్‌గా పరీక్షించగా.. ఐపీఎల్‌ కోసం దుబాయికి వెళ్లి మహమ్మారి బారినపడ్డ వారి సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం యూఏఈలో బుధవారం 735 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు యూఏఈ తన అధికారిక కొవిడ్‌-19 వెబ్‌సైట్‌లో తెలిపింది. పాజిటివ్‌ కేసులు కొంత తగ్గుముఖం పట్టగా.. మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారి నేపథ్యంలో గురువారం ప్రారంభించాల్సిన యూఏఈ ఫుట్‌బాల్‌ సీజన్‌ను నాలుగు వారాలు వాయిదా వేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo