e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే!

టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే!

ముంబై: టీమిండియా మెన్స్ క్రికెట్ హెడ్ కోచ్‌గా మ‌ళ్లీ అనిల్ కుంబ్లే బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రి ప‌దివీకాలం ముగియ‌నున్న‌ది. ఆ త‌ర్వాత ఆ పోస్టు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోర‌నున్న‌ట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. నిజానికి 2016-17 మ‌ధ్య కాలంలో టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే చేశాడు. స‌చిన్‌, ల‌క్ష్మ‌ణ్‌, గంగూలీ నేతృత్వంలోని అప్ప‌టి అడ్వైజ‌రీ క‌మిటీ కుంబ్లేను కోచ్‌గా నియ‌మించింది. కానీ విరాట్‌, కుంబ్లే మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో.. కుంబ్లే కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడు.

- Advertisement -

ఐపీఎల్‌లోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు మెంట‌ర్‌గా ఉన్న ల‌క్ష్మ‌ణ్‌కు కూడా కోచింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు బీసీసీఐ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ల‌క్ష్మ‌ణ్ పోటీలో ఉన్నా.. కుంబ్లేనే హెడ్ కోచ్ పోస్టుకు ఫెవ‌రేట్‌గా ఉంటార‌ని అంచ‌నాలు వేస్తున్నారు. బీసీసీఐ ఆలోచ‌న‌లు బాగానే ఉన్నా.. కుంబ్లే, ల‌క్ష్మ‌ణ్‌లు హెడ్ కోచ్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటారా లేదా అన్న విష‌యం ఇప్పుడే చెప్ప‌లేం. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత పొట్టి క్రికెట్‌కు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్న‌ట్లో కోహ్లీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లక్ష్మ‌ణ్‌, కుంబ్లేలు ఇద్ద‌రూ వందకుపైగా టెస్టులు ఆడిన నేప‌థ్యంలో వారికి కోచ్ ప‌ద‌వి ద‌క్కేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. మాజీ బ్యాట్స్‌మెన్ విక్ర‌మ్ రాథోడ్ కూడా కోచ్ పోస్టుకు పోటీప‌డే ఛాన్సు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement