సోమవారం 23 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 17:57:26

ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌..!?

ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌..!?

దుబాయ్:‌ ఐపీఎల్‌లో  ముంబై ఇండియన్స్‌  తరఫున బరిలో దిగుతున్న  రోహిత్‌ శర్మ త్వరలో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నట్లు   బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  గాయం సమస్యలు ఉన్నప్పటికీ ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాత నవంబర్‌ 11న టీమ్‌ఇండియాతో కలిసి హిట్‌మ్యాన్‌  విమానం ఎక్కనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

'ఈ విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారు.  రోహిత్ జట్టుతో కలిసి ఉండటమే మంచిది. ఫిజియో నితిన్ పటేల్, ట్రైనర్‌ నిక్ వెబ్ పర్యవేక్షణలో అతడు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం.  ఇది ఎలా జరుగుతుందో చూద్దాం.' అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఆతిథ్య ఆసీస్‌తో   నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే వన్డే సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతినిచ్చి టీ20 సిరీస్‌లో ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.  టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యే వరకు అతడు ఐదు రోజుల మ్యాచ్‌ ఆడటం  కోసం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి సమయం దొరుకుతుంది.