బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 28, 2021 , 12:54:06

ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవ‌స‌రం లేదు కానీ..

ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవ‌స‌రం లేదు కానీ..

చెన్నై: ఇండియ‌న్ ఫ్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) వేలం కోసం చెన్నై వ‌చ్చే ఫ్రాంచైజీల‌కు కొవిడ్ గైడ్‌లైన్స్ జారీ చేసింది బీసీసీఐ. ఫిబ్ర‌వ‌రి 18న ఈ వేలం జ‌ర‌గ‌నుండ‌గా.. అంత‌కు 72 గంట‌ల ముందు అంటే ఫిబ్ర‌వ‌రి 15న ఫ్రాంచైజీల ఓన‌ర్లు, వారి వెంట వ‌చ్చే వాళ్లు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వేలం జ‌రిగే వేదిక ద‌గ్గ‌రికి వ‌చ్చిన త‌ర్వాత మ‌రో టెస్ట్ చేస్తారు. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి గ‌రిష్ఠంగా 13 మందినే అనుమ‌తిస్తారు. అందులో 8 మంది మాత్ర‌మే టేబుల్ ద‌గ్గ‌ర కూర్చోవాలి. వీళ్ల‌కు క్వారంటైన్ అవ‌స‌రం లేద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఐపీఎల్ వేలం కోసం ప్లేయ‌ర్స్ రిజిస్ట‌ర్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఫిబ్ర‌వ‌రి 11 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కూ రిజిస్ట‌ర్ చేసుకునే వీలుంటుంది. 

కింగ్స్ పంజాబ్ ద‌గ్గ‌ర 53 కోట్లు

వేలంలో పాల్గొనే ఐపీఎల్ ఫ్రాంచైజీల‌లో అత్య‌ధికంగా కింగ్స్ పంజాబ్ ద‌గ్గ‌ర రూ.53.2 కోట్లు ఉన్నాయి. ఇక అతి త‌క్కువ మొత్తంతో వేలంలోకి వెళ్తున్న ఫ్రాంచైజీల‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఉన్నాయి. వీళ్ల ద‌గ్గ‌ర కేవ‌లం రూ.10 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ కూడా రూ.15 కోట్ల‌తోనే వేలంలోకి వెళ్తోంది. ఇక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్‌లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఈ మినీ వేలం కేవ‌లం ఈ ఏడాది టోర్నీ కోసం మాత్ర‌మే. 2022లో 9 లేదా ప‌ది టీమ్స్ పాల్గొనే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. మ‌రోసారి పూర్తి స్థాయి వేలం నిర్వ‌హించ‌నున్నారు. 


ఇవి కూడా చ‌ద‌వండి

వింత షెడ్యూల్‌.. ఇంగ్లండ్‌లో టీమిండియాతో ఇండియా 'ఎ' ఢీ

పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో హైద‌రాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?

ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించండి..

VIDEOS

logo