శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 00:50:36

జనవరి 1 నుంచి దేశవాళీ క్రికెట్‌

జనవరి 1 నుంచి దేశవాళీ క్రికెట్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఆగిపోయిన దేశవాళీ సీజన్‌ వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. దేశవాళీ క్యాలెండర్‌ అంశంపై బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం సమావేశమైంది. ‘దేశవాళీ క్రికెట్‌ గురించి సుదీర్ఘంగా చర్చించాం. 2021 జనవరి 1వ తేదీ నుంచి సీజన్‌ను ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించాం. పూర్తిస్థాయి రంజీ ట్రోఫీ నిర్వహించాలనుకుంటున్నాం. అయితే అన్ని దేశవాళీ టోర్నీలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు’ అని గంగూలీ చెప్పాడు. అలాగే జనవరి-మార్చి మధ్య రంజీ జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చిన దాదా.. జూనియర్‌ క్రికెట్‌ను సైతం వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌ మధ్య జరుపుతామని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌తో కూడిన క్వారంటైన్‌లో ఉంటుందని, జనవరి చివరికల్లా ఆతిథ్య జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్‌ పూర్తవుతుందని గంగూలీ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్‌ తర్వాత ఆసీస్‌ గడ్డపై భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు కూడా ఆడే అవకాశం ఉంది.  


logo