గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 00:04:19

బీసీసీఐ ఏజీఎమ్‌ నిరవధిక వాయిదా

బీసీసీఐ ఏజీఎమ్‌ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎమ్‌) నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం పేర్కొంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఏజీఎమ్‌ను నిర్వహించలేకపోతున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. తమిళనాడు సొసైటీ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1975 కింద రిజిష్టర్‌ అయిన బీసీసీఐ ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 30లోగా ఏజీఎమ్‌ భేటీని నిర్వహించాలి. అయితే ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో ఏజీఎమ్‌ను నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఏజీఎమ్‌ సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించే వీలు లేదు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాతే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు షా తన లేఖలో వివరించారు. అయితే కొవిడ్‌-19 విస్తరిస్తున్న క్రమంలో సొసైటీ యాక్ట్‌ను తమిళనాడు ప్రభుత్వం పొడిగించే అవకాశముంది. దీంతో సెప్టెంబర్‌, డిసెంబర్‌ మధ్య కాలంలో ఏజీఎమ్‌ నిర్వహణకు చాన్స్‌ ఉంటుందని షా పేర్కొన్నారు. 


logo