శుక్రవారం 29 మే 2020
Sports - Apr 06, 2020 , 14:05:46

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్‌

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్‌

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటిద‌గ్గ‌రే ఉంటున్న ప్ర‌జ‌ల కోసం ఇప్ప‌టికే దూర‌ద‌ర్శ‌న్ ప‌లు పాత ప్రోగ్రామ్‌లు తిరిగి టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే క్రికెట్ అభిమానుల‌కు కూడా బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్  స‌మ‌యం ఇంకా 8 రోజులు ఉండ‌టంతో బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు టీమిండియా ఆడిన పాత మ్యాచుల‌ను ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు ప్ర‌తిరోజు... మూడు మ్యాచుల హైలెట్స్ టెలికాస్ట్ చేస్తామ‌ని పేర్కొంది. వీటిని డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించ‌వ‌చ్చ‌ని తెలిపింది.


logo