శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 13:26:14

ఐపీఎల్‌-2020 కామెంటేటర్లు వీరే..మంజ్రేకర్‌కు నో ఛాన్స్‌

ఐపీఎల్‌-2020 కామెంటేటర్లు వీరే..మంజ్రేకర్‌కు నో ఛాన్స్‌

దుబాయ్‌: ఎప్పుడెప్పుడా అని అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ సందడి మొదలైంది.   ఐపీఎల్‌  నిర్వహణ కోసం బీసీసీఐ  ఏర్పాట్లు  వేగంగా పూర్తిచేస్తున్నది. సెప్టెంబర్‌ 19న ప్రారంభమయ్యే టోర్నీ  కామెంటరీ ప్యానల్‌లో ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. ఓ వార్తాపత్రిక కథనం ప్రకారం.. లీగ్‌ కోసం ఏడుగురు భారతీయ వ్యాఖ్యాతల బృందాన్ని బీసీసీఐ ఖరారు చేసిందని, ఆ జాబితాలో మంజ్రేకర్‌ లేడని పేర్కొంది.

దాస్‌గుప్తా, కార్తీక్‌ అబుదాబిలోని మ్యాచ్‌ వేదిక వద్ద ఉంటారు. మిగిలిన వారు షార్జా, దుబాయ్‌ నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు.  దుబాయ్‌, అబుదాబి చెరో  21 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండగా, షార్జా 14 మ్యాచ్‌లకు  ఆతిథ్యం ఇవ్వనుంది.  కామెంటేటర్లను మూడు బృందాలుగా విభజించి దుబాయ్‌,అబుదాబిలోని బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉంచుతారు. 

ఏడుగురు వ్యాఖ్యాతలు వీరే:

సునీల్‌ గవాస్కర్‌, ఎల్‌ శివరామకృష్ణన్‌, మురళీ కార్తీక్‌, దీప్‌ దాస్‌గుప్తా, రోహన్‌ గవాస్కర్‌, హర్ష భోగ్లే, అంజుమ్‌ చోప్రా


logo