శనివారం 30 మే 2020
Sports - Apr 10, 2020 , 17:20:11

పూర్తి బకాయిలను చెల్లించిన బీసీసీఐ

పూర్తి బకాయిలను చెల్లించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ కారణంగా ఆట నిలిచిపోయినా సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలోని ఆటగాళ్లకు బీసీసీఐ ఈ త్రైమాసికానికి సంబంధించిన బకాయిలను పూర్తిగా చెల్లించింది. ప్రస్తుత అనిశ్చితిలో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు శుక్రవారం చెప్పారు.

“ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలోని ఆటగాళ్లకు త్రైమాసిక చెల్లింపులను బీసీసీఐ పూర్తిగా చేసింది. ఈ వ్యవధిలో భారత్​, భారత్​-ఏ తరఫున ఆడిన వారి మ్యాచ్​ ఫీజులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే చెల్లించింది” అని ఆ అధికారి పేర్కొన్నారు.  కాగా, కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడంతో తమ వేతనాల్లో కోత ఉండే అవకాశం ఉందని ఇంగ్లండ్​, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 


logo