శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 25, 2020 , 00:22:17

చీఫ్‌ సెలెక్టర్‌గా చేతన్‌ శర్మ

చీఫ్‌ సెలెక్టర్‌గా చేతన్‌ శర్మ

అహ్మదాబాద్‌: భారత సీనియర్‌ క్రికెట్‌ జట్ల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ పేసర్‌ చేతన్‌ శర్మ నియమితుడయ్యాడు. మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహాదారుల కమిటీ(సీఏసీ) అతడిని గురువారం ఎంపిక చేసింది. అలాగే ఖాళీగా ఉన్న రెండు సెలెక్టర్ల పోస్టులకు మాజీ పేసర్లు అబె కురువిల్లా, దేబాశిష్‌ మొహంతీని తీసుకుంది. భారత సెలెక్షన్‌ కమిటీలో ఇప్పటికే సునీల్‌ జోషి, హర్విందర్‌ సింగ్‌ ఉన్నారు. సందీప్‌ సింగ్‌, జతిన్‌ పరాన్‌జపే, దేవాంగ్‌ గాంధీ పదవీ కాలం గతేడాది సెప్టెంబర్‌లోనే ముగియగా.. చేతన్‌, దూబే, దేబాశిష్‌ ఇప్పుడు వారి స్థానాలను భర్తీ చేయనున్నారు. అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ టెస్టుల అనుభవం ఉండడంతో చేతన్‌ను చీఫ్‌ సెలెక్టర్‌ పదవి వరించింది. భారత్‌ తరఫున 11ఏండ్ల పాటు చేతన్‌ శర్మ 23 టెస్టులు, 65 వన్డేలు ఆడాడు. 1987 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో సత్తాచాటాడు. ప్యానెల్‌లో సునీల్‌ జోషి సాధారణ సెలెక్టర్‌గా కొనసాగనున్నాడు.


logo