శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 02:55:20

కెప్టెన్లుగా మిథాలీ, కౌర్‌, స్మృతి

కెప్టెన్లుగా మిథాలీ, కౌర్‌,  స్మృతి

ముంబై: ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగే మహిళల ఐపీఎల్‌(టీ20 చాలెంజ్‌) కోసం మూడు జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. వెలాసిటీకి మిథాలీ రాజ్‌,  సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, ట్రైల్‌బ్లేజర్స్‌కు స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. కరోనా నేపథ్యంలో యూఏఈ వేదికగా నవంబర్‌ 4 నుంచి 9వ తేదీ వరకు టోర్నీ జరుగనుంది. మొత్తంగా టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు జరుగనున్నాయి.