e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News WTC Final: కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే

WTC Final: కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే

WTC Final: కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే

ICC World Test Championship final: ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య తుది పోరు ఈనెల 18న ఆరంభంకానుంది. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం పేస్‌, బౌన్స్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించేలా పిచ్‌ తయారు చేస్తున్నారు. కివీస్‌తో ఫైనల్‌ పోరుకు 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రహానె, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా, శుభ్‌మన్‌ గిల్‌, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, హనుమ విహారీలకు చోటు దక్కింది.

భారత జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. ఫైన‌ల్‌లో తలపడే న్యూజిలాండ్‌ జట్టును ఇవాళే విడుదల చేశారు. 15 మందితో కూడిన జట్టును కివీస్‌ ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న కేన్‌ మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

- Advertisement -

భారత జట్టు ఇదే:
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, రహానె(వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారీ, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌

కివీస్‌ టీమ్‌:
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డేవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
WTC Final: కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే
WTC Final: కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే
WTC Final: కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే

ట్రెండింగ్‌

Advertisement