మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 14:06:12

ఐపీఎల్‌ అఫీషియల్ పార్ట్‌నర్‌గా ‘క్రెడ్’

ఐపీఎల్‌  అఫీషియల్ పార్ట్‌నర్‌గా ‘క్రెడ్’

న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020  అధికారిక భాగస్వామిగా బెంగళూరుకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌  ఎంపికైనట్లు  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఐపీఎల్‌   అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఎంపికైన రెండో కంపెనీ క్రెడ్‌ కావడం విశేషం. ఐపీఎల్‌ మూడు సీజన్లకు     అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన ఎడ్యూ-టెక్‌ సంస్థ ‘అన్అకాడమీ’    వ్యవహరిస్తుందని  గతవారం  బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2020  టైటిల్ స్పాన్సర్‌షిప్‌  కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన ‘అన్అకాడమీ’ మూడేళ్లకు గానూ  సుమారు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు  తెలుస్తోంది. 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు   యూఏఈ వేదికగా జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌గా ‘డ్రీమ్ 11’ వ్యవహరిస్తోంది. 


logo