మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 18:33:47

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి  వివో ఔట్

ఢిల్లీ:  భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో    ఐపీఎల్-13వ  సీజన్‌  టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి  వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అధికారికంగా తప్పుకుంది. చైనా మొబైల్ ఫోన్ సంస్థ వివోతో  ఐపీఎల్‌   టైటిల్ స్పాన్సర్‌షిప్‌  ఒప్పందాన్ని బీసీసీఐ  గురువారం  నిలిపివేసింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్ల కోసం  2017లో రూ. 2,199 కోట్లకు దక్కించుకున్నది.  ప్రతీ లీగ్‌లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 

 చైనాతో ఉద్రిక్తతలు  కొనసాగుతున్నప్పటికీ  బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌లో వివోను కొనసాగించడంపై పెద్ద ఎత్తున   విమర్శలు చెల‌రేగాయి.  దీంతో వివోనే స్వచ్ఛందంగా తప్పుకోవడానికి నిర్ణయించుకుంది. ఐపీఎల్‌-2020 సీజన్‌కు  బీసీసీఐ, వివో మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ భాగస్వామ్యాన్ని   రద్దు చేసుకున్నట్లు  బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.  

 2017లో కుదిరిన ఒప్పందం కింద ప్రతి సీజన్‌కు బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తున్న వివో స్పాన్సర్‌షిప్‌ గడువు 2022లో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది పాటు ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌కు దూరంగా ఉండేందుకు వివో సామరస్య పూర్వక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. కొత్త టైటిల్‌ స్పాన్సర్‌ వేటలో పడిన బీసీసీఐ మరో కంపెనీతో ఒప్పందానికి ప్రయత్నాలు చేస్తున్నది.


logo