శనివారం 29 ఫిబ్రవరి 2020
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసు విచారణ వేగవంతం..చావ్లా నోరు విప్పితే..

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసు విచారణ వేగవంతం..చావ్లా నోరు విప్పితే..

Feb 14, 2020 , 14:14:49
PRINT
మ్యాచ్‌ ఫిక్సింగ్‌  కేసు విచారణ వేగవంతం..చావ్లా నోరు విప్పితే..

రెండు దశాబ్దాల క్రితం భారత క్రికెట్‌ను అతలాకుతలం చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌పై పొలీసులు విచారణను వేగవంతం చేశారు.

న్యూఢిల్లీ:  రెండు దశాబ్దాల క్రితం భారత క్రికెట్‌ను అతలాకుతలం చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌పై పొలీసులు విచారణను వేగవంతం చేశారు. స్కామ్‌లో ప్రధాన నిందితుడు, బుకీ సంజీవ్‌ చావ్లాను ఢిల్లీ పోలీసులు లండన్‌ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు.  ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు చావ్లాకు 12 రోజుల పోలీసు కస్టడీ విధించింది. భారత్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లకు  టాప్‌ క్రికెటర్ల సాయంతో చావ్లా మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసే వాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. సంజీవ్‌ నోరు విప్పితే గతంలో స్టార్లుగా   పేరొందిన  మాజీ క్రికెటర్ల బాగోతాల గుట్టు రట్టు అవుతుందని భయపడుతున్నారు.   సంజీవ్‌ నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) కూడా సిద్ధంగా ఉందని ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తెలిపారు. 

'ఢిల్లీలో ఉన్న మా అధికారులు  కేసును పర్యవేక్షిస్తున్నారు. కేసుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఒకవేళ ఢిల్లీ పోలీసులు అనుమతిస్తే సంజీవ్‌ చావ్లాతో మాట్లాడుతాం. మాకు పర్మిషన్‌ లభిస్తే  తప్పకుండా అతన్ని విచారిస్తాం. కేసుపై అవగాహన ఉన్న ఏసీయూ అధికారి ఒకరు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన బీసీసీఐతో పనిచేస్తుండం మాకు బాగా కలిసొస్తుందని' అజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

ఫిక్సింగ్‌కు  సహకరించాల్సిందిగా అప్పటి సౌతాఫ్రికా కెప్టెన్‌ హన్సీ క్రానేను సంజీవ్‌ ప్రోత్సాహించాడని ఆరోపణలున్నాయి.  2000లో భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా.. ఢిల్లీ పోలీసులు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా  భారీ ఫిక్సింగ్‌ కుంభకోణం జరిగిందని  గుర్తించారు. అంతర్జాతీయంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాకెట్‌ కలకలం సృష్టించడంతో  భారత క్రికెట్‌ కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది.


logo