గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Jul 15, 2020 , 11:04:39

బిగ్​బాష్ లీగ్​-10 పూర్తి షెడ్యూల్ విడుదల

బిగ్​బాష్ లీగ్​-10 పూర్తి షెడ్యూల్ విడుదల

మెల్​బోర్న్​: ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్​బాష్ లీగ్​(బీబీఎల్​) పూర్తి షెడ్యూల్ విడుదలైంది. బీబీఎల్​ 10వ సీజన్​ డిసెంబర్​ 3న ప్రారంభమవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. తొలి మ్యాచ్​ అడిలైడ్ స్ట్రయికర్స్​, మెల్​బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరుగనుంది. కరోనా వైరస్ వల్ల భయాందోళనలు ఉన్నా బీబీఎల్​పై ముందుకెళ్లేందుకే సీఏ నిర్ణయించుకుంది. రెండు నెలలకు పైగా జరిగే బీబీఎల్​ 10వ సీజన్​లో మొత్తం 61మ్యాచ్​లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఫైనల్ జరుగనుంది. కాగా భారత్​ – ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కావాల్సిన రోజునే బీబీఎల్​-10 కూడా మొదలుకానుంది. దీంతో భారత్​… ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటే  స్టీవ్ స్మిత్​, వార్నర్​ లాంటి కొందరు ఆసీస్ స్టార్లు బీబీఎల్​లో కొన్ని మ్యాచ్​లకు దూరం కానున్నారు.  కాగా మహిళల బిగ్​బాష్ లీగ్​ ఈ ఏడాది అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 28 వరకు జరుగనుంది.