సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 10:20:12

టాపార్డర్ ప్రదర్శనే కీలకం: మిస్బా

టాపార్డర్ ప్రదర్శనే కీలకం: మిస్బా

మాంచెస్టర్: ఇంగ్లండ్​, పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్​లో ఇరు జట్లకు టాపార్డర్ బ్యాట్స్​మన్ ప్రదర్శనే కీలకం కానుందని పాక్ చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 300కు పైగా పరుగులు చేయగలిగితే 75శాతం విజయం సాధించే అవకాశం ఉంటుందని మీడియా సమావేశంలో మిస్బా అన్నాడు. మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్​, పాకిస్థాన్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ఈ సిరీస్ జరుగనుంది.

“ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ కూడా ఇటీవల(వెస్టిండీస్​తో తొలిటెస్టులో) తడబడింది. ఇంగ్లండ్​, పాక్ జట్ల టాపార్డర్ బ్యాట్స్​మెన్ ఎలా ఆడతాన్నదే కీలకంగా మారనుంది. ఫస్ట్​ ఇన్నింగ్స్​లో 300పై పరుగులు చేస్తే గెలిచేందుకు 75శాతం అవకాశముంటుంది. మా జట్టు సన్నద్ధతపై సంతృప్తిగా ఉన్నాం. మూడు నెలల తర్వాత జట్టు ఆటగాళ్లంత ఒక్కచోట చేరారు. మా బ్యాట్స్​మన్ బాబర్ ఆజమ్​, అజర్ అలీ, అషద్ షఫీక్​పై చాలా అంచనాలు ఉన్నాయి. వారి ప్రదర్శన చాలా ముఖ్యం” అని పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ అన్నాడు. 


logo