ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 24, 2021 , 14:28:14

ఒకేసారి రెండు వైపులా ర‌నౌటైన బ్యాట్స్‌మ‌న్‌.. వీడియో

ఒకేసారి రెండు వైపులా ర‌నౌటైన బ్యాట్స్‌మ‌న్‌.. వీడియో

అడిలైడ్‌: క‌్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని వింత‌లు జ‌రుగుతుంటాయి. అలాంటిదే ఇది కూడా. ఓ బ్యాట్స్‌మ‌న్ ఒకేసారి రెండు వైపులా ర‌నౌట‌య్యాడు. బిగ్ బ్యాష్ లీగ్‌లో ఆదివారం ఈ వింత చోటు చేసుకుంది. సిడ్నీ థండ‌ర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైక‌ర్స్ ఓపెన‌ర్ జేక్ వెదెరాల్డ్ ఇలా రెండవైపులా ర‌నౌట్ కావ‌డం విశేషం. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మ‌న్ ఫిలిప్ సాల్ట్‌.. బంతిని నేరుగా కొట్ట‌గా అది బౌల‌ర్ క్రిస్ గ్రీన్ చేతికి త‌గిలి స్టంప్స్‌ను త‌గిలింది. అప్ప‌టికి వెదెరాల్డ్ బ్యాట్ గాల్లో ఉంది. ఫీల్డ‌ర్లు అప్పీల్ చేస్తున్న స‌మ‌యంలో సాల్ట్ ప‌రుగు కోసం పిలిచాడు. ఈ గంద‌ర‌గోళంలో ఆల‌స్యంగా ప‌రుగందుకున్న వెదెరాల్డ్‌.. అటు వికెట్ కీప‌ర్ ఎండ్‌లోనూ ర‌నౌట‌య్యాడు. అయితే ఒకే బంతికి ఓ బ్యాట్స్‌మ‌న్ రెండుసార్లు ఔటైన‌ట్లు ప్ర‌క‌టించ‌రు కాబ‌ట్టి.. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో రీప్లే చూసి థ‌ర్డ్ అంపైర్ ర‌నౌట్‌గా డిక్లేర్ చేశాడు. 

VIDEOS

logo