సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 01, 2021 , 03:07:28

4,913 కోట్లు

4,913 కోట్లు

  • బార్సిలోనాతో మెస్సీ నాలుగేండ్ల కాంట్రాక్టు మొత్తమిది
  • ఒప్పంద వివరాలు ప్రచురించిన ఓ స్పానిష్‌ పత్రిక  

 బార్సిలోనా: ప్రపంచ క్రీడా చరిత్రలోనే అత్యంత విలువైన కాంట్రాక్టు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెస్‌ మెస్సీదేనన్న సంచలన సమాచారం వెలువడింది. నాలుగేండ్లకు బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో మెస్సీ 555 మిలియన్‌ యూరోల (673 మిలియన్‌ డాలర్లు, దాదాపు రూ. 4913 కోట్లు)కు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఎల్‌ ముండో అనే స్పానిష్‌ పత్రిక ఓ కథనం ప్రచురించింది. 2017లో మెస్సీ సంతకాలు చేసిన ఈ కాంట్రాక్టు పత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది.  రెన్యూవల్‌ ఫీజు, లాయల్టీ బోనస్‌ కింద మిగిలిన మొత్తం ఉందని చెప్పింది. అయితే సంపాదనలో దాదాపు సగం పన్నుల రూపంలో స్పెయిన్‌కు మెస్సీ చెల్లించాలి. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా 510 మిలియన్‌ యూరోలు చెల్లించిందని కూడా ఆ పత్రిక వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి బార్సిలోనాలోనే ఉన్న మెస్సీకి గత ఏడాది ఆ క్లబ్‌తో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వల్ల అప్పుడే బయటకు వెళ్లాలనుకున్నా భారీ మొత్తంలో కాంట్రాక్టు ఉండడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని మెస్సీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. 

లీగల్‌ యాక్షన్‌కు మెస్సీ రెడీ 

కాంట్రాక్టు వివరాలను లీక్‌ చేసిన ఎల్‌ ముండో పత్రికపై న్యాయపరమైన చర్యలకు లియోనెల్‌ మెస్సీతో పాటు బార్సిలోనా సిద్ధమైంది. ఈ ఒప్పందానికి సంబంధించిన కాపీలు మెస్సీ, బార్సిలోనా, లాలీ గా, క్యూవాట్రెకాసస్‌ (అర్జెంటీనా న్యాయ సంస్థ) దగ్గర మాత్ర మే ఉన్నాయి. అయితే బార్సిలోనాలోనే ఎవరో కాంట్రాక్టు సమాచారాన్ని లీగ్‌ చేశారని మెస్సీ అనుమానిస్తున్నట్టు సమాచారం. దీన్ని ఖండించిన ఆ క్లబ్‌ తాము కూడా ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని వెల్లడించింది. 

VIDEOS

logo