సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 00:08:47

ఆర్జనలో మెస్సీ టాప్‌

ఆర్జనలో మెస్సీ టాప్‌

లండన్‌:  బార్సిలోనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ సంపాదనలో టాప్‌లో నిలిచాడు. ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన ఫుట్‌బాల్‌ ప్లేయర్ల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేయగా.. 126మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.927 కోట్లు) సంపాదనతో మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. కాగా 117 మిలియన్‌ డాలర్ల సంపాదనతో పోర్చుగల్‌ స్టార్‌  రొనాల్డో ఈ జాబితాలో రెండో స్థానం దక్కించుకోగా.. నెయ్‌మర్‌ జూనియర్‌ (96మిలియన్‌ డాలర్లు) తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సంపాదనతో బిలియన్‌ డాలర్ల(వంద కోట్ల డాలర్లు) క్లబ్‌లో మెస్సీ అడుగుపెట్టాడు. రొనాల్డో తర్వాత కెరీర్‌లో బిలియన్‌ డాలర్ల మార్కు చేసిన రెండో ఫుట్‌బాలర్‌గానూ లియోనెల్‌ రికార్డులెక్కాడు.


logo