ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 04, 2020 , 21:43:36

మెస్సీకి గాయం!

మెస్సీకి గాయం!

మాడ్రిడ్‌: ప్రముఖ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ ‘లాలీ గా’ వచ్చే వారంలో పునఃప్రారంభం కానుండగా.. బార్సిలోనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ బరిలోకి దిగడంపై అనుమానాలు మొదలయ్యాయి. అతడికి కండరాల సమస్య ఏర్పడిందని, అందుకే జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం లేదని ఓ స్పానిష్‌ చానెల్‌ వెల్లడించింది.

కండరాల సమస్య ఉన్నందుకే జట్టుతో కాకుండా మెస్సీకి ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ ట్రైనింగ్‌ను ఏర్పాటు చేశారని గురువారం చెప్పింది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు బుధవారం మెస్సీకి వైద్య పరీక్షలు జరిగాయని వెల్లడించింది. కరోనా ప్రభావం వల్ల దాదాపు మూడు నెలల పాటు నిలిచిపోయిన లీగ్‌ ఈ నెల 11న పునఃప్రారంభం కానుండగా.. బార్సిలోనా జట్టు 13వ తేదీన బరిలోకి దిగనుంది. 


logo