బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 01:51:05

లిటన్‌ రికార్డు సెంచరీ

 లిటన్‌ రికార్డు సెంచరీ

సీలెట్‌: ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (143 బంతుల్లో 176; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), తమీమ్‌ ఇక్బాల్‌ (128 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకాలతో కదంతొక్కడంతో జింబాబ్వేతో శుక్ర వారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ 123 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో) గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల వరద పారించిన బంగ్లా 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో ఇన్నింగ్స్‌ను 43 ఓవర్లకు కుదించారు. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా లిటన్‌ దాస్‌ రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో తమీమ్‌, లిటన్‌ తొలి వికెట్‌కు 292 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వా మ్యం కావడం విశేషం. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 37.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. సికందర్‌ రజా (61) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌తో బంగ్లా కెప్టెన్‌ మష్రఫే మోర్తజా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 
logo