e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home స్పోర్ట్స్ బంగ్లా విజయం.. మహ్ముదుల్లా వీడ్కోలు

బంగ్లా విజయం.. మహ్ముదుల్లా వీడ్కోలు

బంగ్లా విజయం.. మహ్ముదుల్లా వీడ్కోలు

2009లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన మహ్ముదుల్లా.. పుష్కరకాలం పాటు జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగాడు. 50 టెస్టులు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 2914 పరుగులు చేయడంతో పాటు.. 43 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వేతో మ్యాచ్‌ మూడో రోజే రిటైర్మెంట్‌ ప్రకటించిన మహ్ముదుల్లా కెరీర్‌లో అత్యధిక స్కోరు (150 నాటౌట్‌) చివరి ఇన్నింగ్స్‌లోనే సాధించడం విశేషం.

హరారే: జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ భారీ విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లా ఆటగాళ్లు.. తమ సీనియర్‌ ఆటగాడు మహ్ముదుల్లాకు విజయంతో ఘనమైన వీడ్కోలు పలికారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడిన మహ్ముదుల్లా (150) భారీ శతకం బాదడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా.. జింబాబ్వే 276 పరుగులకు ఆలౌటైంది. అనంతరం షాద్‌మన్‌ ఇస్లాం (115 నాటౌట్‌), నజ్ముల్‌ హుసేన్‌ (117 నాటౌ ట్‌) శతకాలతో బంగ్లా 284/1 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి జింబాబ్వే ముందు 477 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ ఛేదనలో తడబడ్డ జింబాబ్వే 256 పరుగులకు ఆలౌటై.. 220 పరుగుల తేడాతో ఓడింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగ్లా విజయం.. మహ్ముదుల్లా వీడ్కోలు
బంగ్లా విజయం.. మహ్ముదుల్లా వీడ్కోలు
బంగ్లా విజయం.. మహ్ముదుల్లా వీడ్కోలు

ట్రెండింగ్‌

Advertisement