మంగళవారం 07 జూలై 2020
Sports - Jun 25, 2020 , 00:22:27

లంకలో బంగ్లా జట్టు పర్యటన వాయిదా

లంకలో బంగ్లా జట్టు పర్యటన వాయిదా

దుబాయ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటన వాయిదా పడింది. వచ్చే నెలలో లంక వేదికగా బంగ్లాదేశ్‌ మూడు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉన్నా.. వైరస్‌ ప్రభావం పెరుగుతుండటంతో పర్యటనను వాయిదా వేసుకుంది. ‘జూలైలో శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్‌ వాయిదా పడింది’ అని ఐసీసీ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొంది. రెండు రోజుల క్రితమే న్యూజిలాండ్‌ జట్టు.. బంగ్లాదేశ్‌ పర్యటనను రద్దు చేసుకోగా.. తాజాగా బంగ్లా టీమ్‌ లంక వెళ్లేందుకు నిరాకరించింది. ఈ అంశాన్ని లంక క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది. ‘ప్రస్తుతం ప్రయాణ యో గ్యమైన వాతావరణం లేకపోవడంతో సిరీస్‌ను వాయిదా వేస్తున్నామని బంగ్లా క్రికెట్‌ బోర్డు మాకు వివరించింది’ అని లంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. logo