గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 10, 2020 , 17:00:19

మొన్న టీ20..నేడు టెస్టు కెప్టెన్‌కు కరోనా

మొన్న టీ20..నేడు టెస్టు కెప్టెన్‌కు కరోనా

ఢాకా:  బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్‌ మహ్మదుల్లా  రియాద్‌  కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు టెస్టు కెప్టెన్‌ మొమినుల్‌ హాక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అతడు హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు.  మోమినుల్‌కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ దేబషీశ్‌ చౌదరి తెలిపారు. తనకు మైల్డ్‌ ఫీవర్‌ ఉండటంతో కరోనా టెస్టు చేయించుకున్నానని హాక్‌ వెల్లడించాడు. 

34 ఏళ్ల  ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లాకు పాజిటివ్‌గా తేలడంతో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ( పీఎస్‌ఎల్‌‌)  ప్లేఆఫ్స్‌కు దూరమైన విషయం తెలిసిందే.   కొన్నిరోజుల క్రితం కరోనా బారినపడిన మష్రాఫీ మోర్తాజా, అబు జాయేద్‌, సైఫ్‌ హసన్‌ కోలుకున్నారు.