శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 21:52:39

బంగ్లాదేశ్ పేసర్ ఖాజీ ఒనిక్‌పై రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్ పేసర్ ఖాజీ ఒనిక్‌పై రెండేళ్ల నిషేధం

ఢాకా : బంగ్లాదేశ్ జట్టు పేసర్‌ ఖాజీ ఒనిక్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018 నవంబర్‌లో జాతీయ క్రికెట్‌ లీగ్‌ డోపింగ్‌ టెస్టులో ఆయన విఫలం కావడంతో బోర్డు తాము నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా ఖాజీ ఒనిక్‌పై నిషేధం విధించింది. కాక్స్ బజార్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒనిక్ మెథాంఫేటమిన్‌ అనే నిసేధిత ఉత్ర్పేరకాన్ని వినియోగించినట్లు పరీక్షలో తేలింది.

మెథాంఫేటమిన్‌ను ఐసీసీ 2018లో నిషేధిత జాబితాలో చేర్చింది. ఒనిక్‌ సైతం తాను నేరం చేసినట్లు అంగీకరించి డోపింగ్ నిబంధన ఉల్లంఘనకు రెండేళ్ల సస్పెన్షన్‌కు అంగీకరించాడు. ఫిబ్రవరి 8, 2019 నుంచి ఒనిక్‌పై సస్పెన్షన్‌ ప్రారంభం కాగా ఫిబ్రవరి 7, 2021 వరకు కొనసాగుతుంది. న్యూజిలాండ్‌లో జరిగిన 2018 అండర్ -19 ప్రపంచ కప్‌లో ఒనిక్ బంగ్లాదేశ్‌ జట్టులో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో అతడు 4.58 ఎకానమీ రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు.  26 లిస్ట్-ఏ ఆటల్లో మొత్తం 41 వికెట్లు కూల్చాడు.


logo