శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 01:00:51

విండీస్‌ వైట్‌వాష్

విండీస్‌ వైట్‌వాష్

  • మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ ఘన విజయం 

చిట్టగాంగ్‌: సొంతగడ్డపై గర్జించిన బంగ్లాదేశ్‌ 3-0తో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో సమిష్టిగా రాణించిన బంగ్లా 120 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది. సీనియర్లు  కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (64), ముష్ఫికర్‌ రహీమ్‌ (64), మహమ్మదుల్లా (64నాటౌట్‌), షకీబ్‌ అల్‌ హసన్‌ (51) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆరు వికెట్లకు 297 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్యఛేదనలో యువ వెస్టిండీస్‌ 44.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. 


VIDEOS

logo