కొత్త రికార్డు నెలకొల్పిన బంగ్లా క్రికెటర్

ఢాకా: భారత జట్టుకు చెందిన లెజండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ టెస్ట్, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును కలిగి ఉండగా.. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా నిలిచారు. అయితే, ఈ మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు చెందిన బ్యాట్స్‌మన్ అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఒక దేశం తరపున మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక స్కోరు సాధించిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్‌గా తమీమ్ ఇక్బాల్ అవతరించారు.
2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన 31 ఏండ్ల వయసున్న బంగ్లాదేశ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్.. ఇప్పుడు టెస్టులు, వన్డేలు, టీ20.. మూడు ఫార్మాట్లలో ఒక దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా అవతరించారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్.. వన్డే, టీ 20 అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే బంగ్లాదేశ్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌ను అధిగమించాడు. వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో తొమ్మిదో పరుగు సాధించడంతో తమీమ్ ఇక్బాల్ ఈ ఘనత సాధించి కొత్త రికార్డను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే, ఆ తరువాతి బంతికే అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్ తరఫున 61 వ టెస్ట్ ఆడుతున్న తమీమ్ ఇక్బాల్.. 9 సెంచరీలతో 4,414 పరుగులు చేశాడు. ముష్ఫికర్ రహీమ్ 70 టెస్టుల్లో 7 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 4,413 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ కూడా ఆడుతున్నాడు. అతను ఒకటో, రెండో పరుగులు చేస్తే చాలా అత్యధిక పరుగుల ఇక్బాల్ రికార్డును మళ్లీ దాటేయవచ్చు. ఇలాఉండగా, తమీమ్ ఇక్బాల్ వన్డేల్లో 210 మ్యాచుల్లో 13 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలతో 7,360 పరుగులు చేశాడు. ఇదే సమయంలో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 74 టీ20 అంతర్జాతీయ మ్యాచులలో 1,701 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి..
కుప్పకూలిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్ రాకెట్
చరిత్రలో ఈరోజు.. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన గుటెన్బర్గ్ వర్ధంతి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ