శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 18:51:29

బంగ్లాదేశ్​ పేసర్​పై రెండేండ్ల నిషేధం

బంగ్లాదేశ్​ పేసర్​పై రెండేండ్ల నిషేధం

ఢాకా: బంగ్లాదేశ్ యువ ఫాస్ట్ బౌలర్​ ఖ్వాజీ ఒనిక్​ రెండేండ్ల నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ టెస్టులో విఫలమవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అతడిపై వేటు వేసింది. నవంబర్​ 2018లో నేషనల్ క్రికెట్ లీగ్ సందర్భంగా ఒనిక్ నుంచి డోప్ టెస్టుల కోసం బీసీబీ నమూనాలను సేకరించింది. అయితే పరీక్షల్లో నిషిద్ధ ఉత్ర్పేరకాలు తీసుకున్నట్టు తేలడంతో బీసీబీ ఒనిక్​పై రెండేండ్ల నిషేధం విధించింది. ఒనిక్ తన తప్పును అంగీకరించి, వేటును సమ్మతించాడు. గతేడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఒనిక్​పై ప్రాథమిక సస్పెన్షన్ ఉంది. దీంతో అప్పటి నుంచే నిషేధం లెక్కలోకి రానుంది. దీంతో 2021 ఫిబ్రవరి 7న మళ్లీ క్రికెట్ ప్రారంభించేందుకు ఖ్వాజీ ఒనిక్​ అర్హుడవుతాడు. 


logo