శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 18, 2020 , 00:46:48

షకీబ్‌ నిన్ను చంపేస్తా..

 షకీబ్‌ నిన్ను చంపేస్తా..

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ను హత్య చేస్తామని బెదిరింపులకు దిగారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన కాళీ మాత పూజ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతడిని హతమారుస్తానంటూ మోసిన్‌ తాలుక్దార్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ లైవ్‌లో బెదిరించాడు. మరికొందరు కూడా షకీబ్‌ను దూషించారు. అలాగే బంగ్లాలోని మత పెద్దలు సైతం షకీబ్‌ చర్యను వ్యతిరేకించారు. దీంతో అతడు స్పందించాడు. తాను కేవలం రెండు నిమిషాల పాటే పూజ దగ్గర ఉన్నానని, ప్రారంభించలేదని షకీబ్‌ వివరణ ఇచ్చాడు. తన మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించాలంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా బుకీ సంప్రదింపులపై ఫిర్యాదు చేయలేదనే కారణంగా ఐసీసీ విధించిన ఏడాది నిషేధాన్ని షకీబ్‌ ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.