న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత సాధించిన వారు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 15
ఇందులో మేనేజర్ ఫైనాన్స్ 6, ఆఫీసర్ అకౌంట్స్ 7, అసిస్టెంట్ అకౌంట్స్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సీఏ, 10+2+3 విధానంలో డిగ్రీ పూర్తి ఉండాలి. ఆఫీసర్ అకౌంట్స్ పోస్టుకు 30 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
ఈ-మెయిల్: hrhq.aiasl@airindia.in
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
వెబ్సైట్: http://www.aiatsl.com/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి