శనివారం 16 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 00:42:31

జూడో అధ్యక్షుడిగా బండా ప్రకాశ్‌

జూడో అధ్యక్షుడిగా బండా ప్రకాశ్‌

హైదరాబాద్‌: తెలంగాణ జూడో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లోని అల్లూరి కళాశాలలో అసోసియేషన్‌ ఎన్నిక ప్రక్రియ ఆదివారం జరిగింది. అధ్యక్ష స్థానానికి బండా ప్రకాశ్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గసిరెడ్డి జనార్దన్‌ రెడ్డి, కోశాధికారిగా పి.బాలరాజుతో పాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మొత్తం 26 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశంలోనే జూడో క్రీడలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని బండా ప్రకాశ్‌ స్పష్టం చేశారు.