బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 00:12:51

బల్బీర్‌ సింగ్‌ కన్నుమూత

బల్బీర్‌ సింగ్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్‌ సింగ్‌ కుల్లర్‌ గుండెపోటుతో మృతి చెందారు. 1968 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడైన కుల్లర్‌.. గతంలో జాతీయ జట్టు సెలెక్టర్‌గానూ పనిచేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ‘నాతో పాటు మా నాన్న అమెరికాకు రావాల్సి ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా జలంధర్‌ జిల్లాలోని మా స్వగృహంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు’ అని బల్బీర్‌ కుమారుడు కమల్బీర్‌ సింగ్‌ ఆదివారం వెల్లడించాడు. కాగా, బల్బీర్‌ అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది.


logo