న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా త్వరలో జరుగనున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పునియా తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా రష్యాకు వెళ్లిన అతడికి అక్కడ గాయమైంది. కాగా, వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలు అక్టోబర్ 2-10 మధ్య నార్వే రాజధాని ఓస్లోలో జరుగనున్నాయి.