శనివారం 28 మార్చి 2020
Sports - Jan 19, 2020 , 01:10:07

ఫైనల్లో బజరంగ్‌

ఫైనల్లో బజరంగ్‌

రోమ్‌: భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా రోమ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బజరంగ్‌.. శనివారం 65 కేజీల ఫ్రీస్టయిల్‌ సెమీఫైనల్లో 6-4తో వాసిల్‌ షుఫ్తార్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించి తుదిపోరుకు చేరాడు. ఫైనల్లో జోర్డన్‌ మైకెల్‌ ఓలీవర్‌ (అమెరికా)తో బజరంగ్‌ తలపడనున్నాడు. ఇతర విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత దీపక్‌ పునియా (86 కేజీలు), జితేందర్‌ (74 కేజీలు) ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. 


logo