శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 21, 2020 , 22:48:07

SRHvRCB: బెయిర్‌స్టో అర్ధశతకం

SRHvRCB: బెయిర్‌స్టో అర్ధశతకం

దుబాయ్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌  బెయిర్‌ స్టో  అర్ధశతకంతో  చెలరేగాడు. 37 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ సాధించాడు.  ఐపీఎల్‌లో అతనికి మూడో అర్ధశతకం.  14వ ఓవర్లోనే సన్‌రైజర్స్‌ 100 పరుగుల మార్క్‌ను దాటింది.  సూపర్‌ ఫామ్‌లో ఉన్న  బెయిర్‌స్టో జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు.

సహచర ఓపెనర్‌  డేవిడ్‌ వార్నర్‌ అనూహ్యంగా రనౌట్‌ కావడంతో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు.  మనీశ్‌ పాండే(34)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 108 పరుగులు   చేసింది. గార్గ్‌(3), జానీ బెయిర్‌స్టో(56) క్రీజులో ఉన్నారు.