మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 13, 2020 , 23:43:22

మొమోటాకు గాయాలు

మొమోటాకు  గాయాలు

కౌలాలంపూర్‌: ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కెంటా మొమోటా(జపాన్‌) రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. మలేషియా మాస్టర్స్‌ గెలిచిన కొద్ది గంటల తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుంది. మొమోటాతో పాటు అసిస్టెంట్‌ కోచ్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఓ బ్యాడ్మింటన్‌ అధికారి ప్రయాణిస్తున్న కారు సోమవారం తెల్లవారుజామున ముందు ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన వారికి గాయాలయ్యాయి. మొమోటా ముక్కుకు, ముఖానికి గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో మొమోటాకు ఈ ప్రమా దం ఆటంకంగా మారింది.logo
>>>>>>