మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Jul 29, 2020 , 10:07:19

కొరియా ఓపెన్ స‌హా నాలుగు బ్యాడ్మింట‌న్‌ టోర్నీల ర‌ద్దు

కొరియా ఓపెన్ స‌హా నాలుగు బ్యాడ్మింట‌న్‌ టోర్నీల ర‌ద్దు

కౌలాలంపూర్‌: క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో తైపీ ఓపెన్‌, కొరియా ఓపెన్‌తోపాటు మ‌రో రెండు టోర్నీల‌ను బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ (బీడబ్ల్యూఎఫ్‌) ర‌ద్దుచేసింది. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో క్రీడాకారులు, వ‌లంటీర్లు, ప్రేక్ష‌కులు, వివిధ‌ సంఘాల స‌భ్యుల మేళుకోసమే టోర్న‌మెంట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు బీడ‌బ్ల్యూఎఫ్‌ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ థామ‌స్ లండ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. టోర్న‌మెంట్ల‌ ర‌ద్దు త‌మను తీవ్ర నిరాశ‌కు గురిచేసింద‌ని, కానీ ప్ర‌తిఒక్క‌రి శ్రేయ‌స్సు కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.  

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, స్థానిక అధికారులు, అంత‌ర్జాతీయ‌, దేశీయ ప్ర‌యాణ ప‌రిమితులకు సంబంధించిన నిబంధ‌న‌ల‌కు డ‌బ్ల్యూబీఎఫ్ 100 శాతం క‌ట్ట‌బుడి ఉంటుంద‌ని, వాటికి అనుగుణంగా టోర్నీల‌ను స‌ర్దుబాటు చేస్తూనే ఉంటామ‌ని తెలిపారు. తైపీ ఓపెన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, కొరియా ఓపెన్ సెప్టెంబ‌ర్ 8 నుంచి 13 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉన్నాయి. ర‌ద్ద‌యిన వాటిలో చైనా ఓపెన్‌, జ‌పాన్ ఓపెన్ కూడా ఉన్నాయి. ఈ రెండు టోర్నీలు సెప్టెంబ‌ర్ రెండో వారంలో జ‌ర‌గాల్సి ఉన్నాయి.  


logo