బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 00:08:51

థామస్‌, ఉబర్‌ కప్‌ వాయిదా

థామస్‌, ఉబర్‌ కప్‌ వాయిదా

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్‌, ఉబర్‌ కప్‌ టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కరోనా వైరస్‌ తీవ్రత వల్ల ప్రధాన దేశాలు పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) ఈ నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి 11వ తేదీ వరకు జరుగాల్సిన ఈ టీమ్స్‌ టోర్నీని 2021కి వాయిదా వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. అయితే తేదీలను ఖరారు చేయలేదు. థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా, చైనీస్‌ తైపీ, అర్జెంటీనా, ఇండోనేషియా, దక్షిణకొరియా టోర్నీలో పాల్గొనబోమని ప్రకటించడంతో.. బీడబ్ల్యూఎఫ్‌ అత్యవసర వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించింది. చర్చల అనంతరం థామస్‌, ఉబర్‌ టోర్నీని వాయిదా వేసేందుకే బీడబ్ల్యూఎఫ్‌ మొగ్గుచూపింది. 


logo