శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 31, 2020 , 10:53:43

డిప్యూటీ డైరెక్ట‌ర్లుగా క‌వితా దేవి, బ‌బితా ఫోగ‌ట్‌

డిప్యూటీ డైరెక్ట‌ర్లుగా క‌వితా దేవి, బ‌బితా ఫోగ‌ట్‌

న్యూఢిల్లీ: భార‌త రెజ్ల‌ర్ బ‌బితా ఫోగ‌ట్‌, క‌బ‌డ్డీ క్రీడాకారిణి క‌వితా దేవీల‌ను క్రీడా, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్లుగా హ‌ర్యానా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ పోస్టు కోసం ఇద్ద‌రు క్రీడాకారులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో క‌విత‌, బ‌బితాల‌ను డిప్యూటీ డైరెక్ట‌ర్లుగా నియమిస్తూ హ‌ర్యానా క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల‌ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ జూలై 29న ఆదేశాలు జారీచేశారు. 30 రోజుల్లోగా పంచ‌కుల డైరెక్ట‌రేట్‌లో రిపోర్ట్ చేయాల‌ని పేర్కొన్నారు. 

కాగా త‌న నియామ‌కంపై ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్‌కు బ‌బితా ఫొగ‌ట్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


logo