శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 16:41:29

షర్ట్‌పై ఆల్కహాల్‌ బ్రాండ్‌ లోగోను వేసుకోను: పాక్‌ కెప్టెన్‌

షర్ట్‌పై ఆల్కహాల్‌ బ్రాండ్‌ లోగోను వేసుకోను: పాక్‌ కెప్టెన్‌

లండన్‌:  ఇంగ్లాండ్‌లో జరుగుతున్న క్రికెట్‌ లీగ్‌ టీ20 బ్లాస్ట్‌లో  తన షర్ట్‌పై ఆల్కహాల్‌ బేవరేజ్‌ కంపెనీ లోగోను   ప్రదర్శించేదిలేదని  పాకిస్థాన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌  బాబర్‌ అజామ్‌   ఇంగ్లీష్‌ కౌంటీ  జట్టు సోమర్‌సెట్‌కు స్పష్టం చేశాడు. మంగళవారం పాకిస్థాన్‌ పర్యటన ముగిసిన తర్వాత సోమర్‌సెట్‌లో చేరిన బాబర్‌ తాను ధరించిన   షర్ట్‌ వెనుక భాగంలో మద్యం కంపెనీ లోగో కనిపించింది.  దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వచ్చాయి.

సోమర్‌సెట్‌తో   ఒప్పందం సమయంలోనే   ఏ ఆల్కహాల్‌ కంపెనీ లోగోను   ప్రమోట్‌ చేసేదిలేదని అతడు స్పష్టం చేసినట్లు బాబర్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.  పొరపాటున బాబర్‌ షర్ట్‌ వెనకాల లోగో ఉందని, తర్వాతి మ్యాచ్‌లో  లోగోను తొలగిస్తామని కౌంటీ అతనికి హామీ ఇచ్చిందని   వారు వివరించారు.  సోమర్‌సెట్‌ తరఫున తొలి మ్యాచ్‌లో 42 పరుగులు  చేసిన బాబర్‌..ఒక అద్భుతమైన క్యాచ్‌ అందుకొని తన  జట్టును 16 పరుగుల తేడాతో గెలిపించాడు. 


logo