శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 18:24:16

టాప్‌-2లోనే కోహ్లీ, రోహిత్‌

టాప్‌-2లోనే కోహ్లీ, రోహిత్‌

దుబాయ్:‌ ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో పేసర్‌ బుమ్రా రెండో ర్యాంకులో ఉన్నాడు. కరోనా మహమ్మారి వల్ల   కోహ్లీ, రోహిత్‌ కనీసం ఒక్క వన్డే మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయినప్పటికీ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కోహ్లీ 871 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రోహిత్‌ 855 పాయింట్లతో రెండో స్థానంలో  ఉంటూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 

పాకిస్థాన్‌, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది.  జింబాబ్వేతో సిరీస్‌లో 221 పరుగులు సాధించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌..వీరిద్దరి ర్యాంకులపై కన్నేశాడు. సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బాబర్‌(837 పాయింట్ల) ఎనిమిది పాయింట్లు సాధించి మూడో ర్యాంకులో నిలిచాడు. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో ఉండగా..విరాట్‌ తొమ్మిదిలో కొనసాగుతున్నాడు.