హైదరాబాద్: వివిధ పరీక్షల షెడ్యూల్‌ను బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రకటించింది. వచ్చే నెల 6 నుంచి ఆగస్టు 1 వరకు డిగ్రీ (సీబీసీఎస్ ఓల్డ్ బ్యాచ్), బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశపరీక్షలు, ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్) పరీక్షలు జరగనున్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.braounline.inలో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం అధ్యయన కేంద్రం లేదా విశ్వవిద్యాలయ వెబ్సైట్లు www.braou.ac.in /www.braouonlione.inను సందర్శించవచ్చని చెప్పారు.