శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 00:12:18

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ ప్రి వాయిదా

 అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ ప్రి వాయిదా

బాకు (అజర్‌బైజాన్‌): ఫార్ములావన్‌ సీజన్‌పై కూడా కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్నది. సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ ప్రి.. కొవిడ్‌-19 కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ ఏడాది జరుగాల్సిన ఎనిమిది రేస్‌లు మహమ్మారి కారణంగా రైద్దెన విషయం తెలిసిందే. ‘బాకు సిటీ సర్క్యూట్‌లో జరుగాల్సిన రేస్‌ రైద్దెంది. ప్రస్తుతానికి జూన్‌ 7న తిరిగి నిర్వహించాలనుకుంటున్నాం. అప్పటి వరకు పరిస్థితుల్లో మార్పు వస్తేనే రేస్‌ జరుగుతుంది. ఏదేమైనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని రేస్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


logo