గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 11, 2021 , 16:21:50

నదీమ్‌పై వేటు.. అక్షర్‌కు ఛాన్స్‌!

నదీమ్‌పై వేటు.. అక్షర్‌కు ఛాన్స్‌!

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌ కోసం తుది జట్టు ఎంపికపై భారత క్రికెట్‌ జట్టు దృష్టిసారించింది. తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిని ఎదుర్కొన్న టీమ్‌ఇండియా బౌలింగ్‌ విభాగంలో పలు మార్పులు చేసే వీలుంది. ముఖ్యంగా తొలి టెస్టులో తేలిపోయిన స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌పై వేటు పడటం ఖాయం కనిపిస్తోంది.

మోకాలి  గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన అక్షర్‌ పటేల్‌ రెండో టెస్టులో  జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.  39 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లను ఆడిన 27ఏండ్ల అక్షర్‌ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది. 

'అక్షర్‌ మోకాలికి స్వల్ప గాయమైంది. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. రాబోయే రెండు రోజుల్లో  అతడు బౌలింగ్‌ సాధన ప్రారంభిస్తాడని' బీసీసీఐ సీనియర్‌ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం నాటికి నదీమ్‌ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై ఓస్పష్టత వచ్చే అవకాశం ఉంది.  అక్షర్‌ బంతితో పాటు బ్యాట్‌తో రాణించగలడు. 

VIDEOS

logo