శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 17:10:55

ఇంగ్లాండ్‌ ఢమాల్‌..విజయానికి చేరువలో భారత్‌

ఇంగ్లాండ్‌ ఢమాల్‌..విజయానికి చేరువలో భారత్‌

చెన్నై: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో వరుసగా మూడో రోజు భారత్  పూర్తి ఆధిపత్యం ప్ర‌ద‌ర్శించింది. రెండో టెస్టులో టీమ్‌ఇండియా గెలుపు దాదాపు ఖాయమైంది. మ్యాచ్‌లో  విజయానికి భారత్ 7‌ వికెట్ల దూరంలో ఉంది. స్పిన్‌కు విపరీతంగా సహకరిస్తున్న పిచ్‌పై  స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్ చెల‌రేగి‌ ఇంగ్లాండ్‌ను భారీ దెబ్బకొట్టారు.  భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కోలుకోకుండా ఒత్తిడి పెంచారు.  

ఈ టర్నింగ్‌ పిచ్‌పై ఇంగ్లాండ్‌ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. 482  పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ సోమవారం ఆటముగిసే సమయానికి 3  వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.  ప్ర‌స్తుతం జో రూట్‌(2), డేనియల్‌ లారెన్స్‌(19) క్రీజులో ఉన్నారు. డొమినిక్‌ సిబ్లే(3), జాక్‌ లీచ్‌(0)లను అక్షర్‌ పెవిలియన్‌ పంపగా..రోరీ బర్న్స్‌(25)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు.  ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 429 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆట మొదటి సెషన్‌లోనే ప్రత్యర్థిని కుప్పకూల్చాలని కోహ్లీసేన భావిస్తున్నది. 

రెండో ఇన్నింగ్స్‌లో  రవిచంద్రన్‌ అశ్విన్‌(106) మెరుపు శతకానికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(62) అర్ధసెంచరీతో రాణించడంతో 286 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 195 పరుగులు కలుపుకొని ఇంగ్లాండ్‌కు భారత్‌ 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్‌  స్పిన్నర్లు మెయిన్‌ అలీ(4/98), జాక్‌ లీచ్‌(4/100) మాత్రమే వికెట్లు పడగొట్టారు. భారత్‌ గెలుపొందడంలో అశ్విన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో  రవిచంద్రన్‌ అశ్విన్‌(106) మెరుపు శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌(5/43) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 134 పరుగులకే కుప్పకూలింది. 

భారత్‌ 

తొలి ఇన్నింగ్స్‌:329

రెండో ఇన్నింగ్స్‌:286

ఇంగ్లాండ్‌

తొలి ఇన్నింగ్స్‌:134


VIDEOS

logo